నా నోట నీ మాట
గీతము 58
నా నోట నీ మాట గానమయ్యే వేళ
నా గుండె నీ వుండి మ్రోగింపవా వీణ?
రాగ మెరుగని వీణ,రక్తి నెరుగని వీణ
తీగపై నీ చేయి తీయకే గడెయేని !
అంతరాంతరము నీ అమృత వీణే యైన
మాట కీర్తన మౌను, మనికి నర్తన మౌను !
ఈ అనంత పథాన ఏ చోటి కా చోటు
నీ ఆలయ మ్మౌను, నీ ఓలగ మ్మౌను!
అడు గడుగునకు స్వామి అడుగు సవ్వడి వినిన
ఎడద లోలోన ఎల్లెడల విశ్వము లోన
ఈ యాత్ర ముగియునో ఏ వేల దిగుదునో,
హాయిగా చల్లగా సాగిపోవుదు నంతె!
దేవదేవా !మహాదేవ !లోకేశ్వరా!
దీనబంధూ !దయాసింధూ! ప్రాణేశ్వరా!
గడెయేని నీ వియోగము సహింపగలేను
విడిపోని నీ చెల్మివిధ మేమొ సెలవిమ్ము !
డిసెంబరు 8, 2007. టాగులు: Devulapalli, Devulapalli Krishna Sastry, Telugu kavitalu. దేవులపల్లి కృష్ణశాస.
Ramana replied:
Hi,
This is very good poem.
Thanks
Ramana
మార్చి 6, 2008 at 4:18 పూర్వాహ్నం. శాశ్వత లింకు .
ప్రసాద్ replied:
మీ పాటల అభిరుచి చాలా బాగుంది.
–ప్రసాద్
http://blog.charasala.com
జులై 21, 2008 at 5:37 అపరాహ్నం. శాశ్వత లింకు .
amritaveena replied:
ధన్యవాదాలు ప్రసాద్ గారు
జులై 21, 2008 at 6:54 అపరాహ్నం. శాశ్వత లింకు .
Srinivas replied:
Nice website..what is ur orkut ID..
అక్టోబర్ 24, 2008 at 6:31 అపరాహ్నం. శాశ్వత లింకు .