ముద్దుల నా యెంకి

  ముద్దుల నా యెంకి

   గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
   కూకుండ నీదురా కూసింత సేపు!
   …………………..
  నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది,
   యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ!
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ  ||
……………….
   కన్ను గిలిగిస్తాది నన్ను బులిపిస్తాది,
   దగ్గరగ కూకుంటే అగ్గిసూస్తాదీ!
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ  ||
……………….
   యీడుండమంటాది ఇలు దూరిపోతాది,
   యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ!
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ  ||
……………….
   మందో మాకో యెట్టి మరిగించినాదీ,
   వల్లకుందామంటే పాణ మాగదురా!
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ  ||
……………….

జనవరి 13, 2008. యెంకి పాటలు.

No Comments Yet

వ్యాఖ్యానించిన మొదటివారవ్వండి!

ప్రత్యుత్తరమిమ్ము

Trackback URI