ఉగాది పండుగ వచ్చింది
ఉగాది పండుగ వచ్చింది
ఊరికి అందం తెచ్చింది
ఉత్సవాలతో దేవుళ్ళకు
ఊరేగింపులు సాగాయి
గుడిలో దేవుని పూజించి
గురువుల పెద్దలను రావించె
పంచాంగాలను చదివించె
మంచీ చెడ్డలు విన్నాము
అక్కలు బావలు ఆసలతో
చక్కావచ్చారు పండుక్కి
అమ్మ వేకువ లేచింది
అందరికి తలలు కడిగింది
సరిపడే నగలు ఇచ్చింది
సరిక్రొత్త బట్టలు పెట్టింది
కులదేవతలను కొలిచింది
గొప్పగా పూజలు చేసింది
ఊటలు నోట్లో ఊరంగా
ఉగాది పచ్చడి పెట్టింది
ఉగాది పండుగ వచ్చింది
ఊరికి అందం తెచ్చింది
No Comments Yet
వ్యాఖ్యానించిన మొదటివారవ్వండి!