చెప్పులోని రాయి చెవిలోని జోరీగ

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా
విశ్వధాభిరామ వినురవేమ

భావము:
పిల్లల నుంచి పెద్దల వరకు తెలిసిన ఈ పద్యము, వేమన శతకానికే
మకుటాయమానము.సామాన్యుల నుండి మాన్యుల వరకు అందరికీ ఇబ్బందులు
సమానము.చెప్పులో రాయి దూరినా,చెవిలో జోరీగ రొద పెట్టినా, కంటిలో నలుసు
పడినా ,కాలిలో ముల్లు గుచ్చుకున్నాకలిగే బాధ అనుభవైహికవేద్యమే తప్ప
అనిర్వచనీయము.వీటన్నిటికీ మించి ఇంటిలోని ఇల్లాలు సాధింపు,సతాయింపు ఇంకా
ధుర్భరము.వక్రీకరణము లేని ఇన్ని వాస్తవాలు చెప్పాడు కాబట్టే ఇప్పటికీ వేమన ప్రజాకవిగా
జనాల హృదయాల్లో నిలిచిపోయాడు.

ఏప్రియల్ 16, 2008. వేమన పద్యాలు.

No Comments Yet

వ్యాఖ్యానించిన మొదటివారవ్వండి!

ప్రత్యుత్తరమిమ్ము

Trackback URI