కలకానిది విలువైనది

కలకానిది విలువైనది – బ్రతుకు
కన్నీటి ధారలలోనే బలిచేయకు ||

గాలివీచి పూవుల తీగ నేల రాలిపోగా
జాలివీడి అటులేదాని వదలివైతువా
చేరదీసి నీరుపోసి చిగురించనీయవా ||

అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా
కలతలకే లొంగిపోయి కలవరించనేలా
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో ||

అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శొకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏదీ తనంతతానై నీ దరికి రాదు
శొధించి సాధించాలి, అదియే ధీరగుణం ||

ఏప్రియల్ 17, 2008. శ్రీ శ్రీ.

No Comments Yet

వ్యాఖ్యానించిన మొదటివారవ్వండి!

ప్రత్యుత్తరమిమ్ము

Trackback URI