పాలనీడిగింట గ్రోలుచునుండిన
పాలనీడిగింట గ్రోలుచునుండిన
మనుజులెల్ల చూచి మద్యమండ్రు
నిలువదగనిచోట నిలువ నిందలు పుట్టు
విశ్వధాభిరామ వినురవేమ
భావము:
ఈడిగవాని ఇంట్లో కూర్చుని కమ్మని గుమ్మ పాలు తాగినా,కల్లే త్రాగావని అందరూ
అంటారు.అలాగే తగని చోట మంచి పని చేసినా తప్పుగానే భావిస్తారు.అందుకే తగని
చోటుకు వెళ్ళద్దు, వెళ్ళి నిందలు పడద్దు అంటున్నాడు ఈ పద్యములో వేమన.
No Comments Yet
వ్యాఖ్యానించిన మొదటివారవ్వండి!