మనసున మనసై
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము ||
ఆశలు తీరని ఆవేశములో,
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము ||
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము ||
చెలిమియె కరువై, వలపే అరుదై
చెదరిన హృదయము శిలయైపోగా
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము ||
“Dr.చక్రవర్తి ” చిత్రం నుంచి
No Comments Yet
వ్యాఖ్యానించిన మొదటివారవ్వండి!