నెయ్యిలేని కూడు

నెయ్యిలేని కూడు నీఆన కసవది
కూరలేని తిండి కుక్క తిండి
ప్రియము లేని కూడు పిండంపు కూడురా
విశ్వధాభిరామ వినురవేమ

భావము:
నెయ్యి లేని భొజనము గడ్డితో సమానము.కూరలేని తిండి కుక్క తిండితో సమానం. ప్రేమతో పెట్టని భోజనం పిండాకూడుతో సమానం. నెయ్యిలేకపొయినా ,కూరలేకపొయినా తిండి పెట్టండి పర్వాలేదు, కాని పెట్టెదేదయినా ప్రేమతొ పెట్టండి.అప్పుడే పెట్టినవారికీ పుణ్యము వస్తుంది, తిన్నవారికి ఆకలి తీరుతుంది.కాబట్టి వంటకాల రుచి కాదు ముఖ్యం,పెట్టేవారి ఆప్యాయత,ప్రేమ ముఖ్యం అంటున్నాడు ఈ పద్యములో వేమన.

ఏప్రియల్ 30, 2008. వేమన పద్యాలు.

No Comments Yet

వ్యాఖ్యానించిన మొదటివారవ్వండి!

ప్రత్యుత్తరమిమ్ము

Trackback URI