పండమ్మ పండు!

పండమ్మ పండు!
ఏమి పండు? మామిడి పండు
ఏమి మామిడి? ముంత మామిడి
ఏమి ముంత? ఆముదం ముంత
ఏమి ఆముదం? వంట ఆముదం
ఏమి వంట? పిండి వంట
ఏమి పిండి? సున్నిపిండి
ఏమి సున్ని? మినప సున్ని
ఏమి మినప? పెద్ద మినప
ఏమి పెద్ద? బడి పెద్ద
ఏమి బడి? వీధి బడి
ఏమి వీధి? సంత వీధి
ఏమి సంత? గొడ్ల సంత
ఏమి గొడ్లు? బర్రె గొడ్లు

మే 8, 2008. తొక్కు పలుకులు, మన పిల్లల పాటలు. మీ ఉద్దేశ్యం….

బారు బారు

ఇతర ఏ భారతీయ భాషలోను కనపడని, తెలుగు బాల సాహిత్యం లో ఎదిగిన, ఒక విచిత్రమైన ప్రక్రియ తొక్కు పలుకులు.ఈ ప్రక్రియను తొలిసారిగా గృహలక్ష్మి మాసపత్రిక ఆదరించి ప్రోత్సహించింది. ఒక పదం చివర నొక్కి పునరక్తితో మరో పదం సృష్టించడం ద్వారా తొక్కుపలుకులు ఏర్పడతాయి. కొత్త పదాలు త్వరగా నేర్చుకోవడానికి, పలకడానికి తద్వార భాషా విఙ్ఞానం పెంచుకోవడానికి ఇవి ఎంతగానో వినియోగిస్తాయి. ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

బారు బారు

ఏమి బారు – చీమల బారు

ఏమి చీమ –  గండు చీమ

ఏమి గండు –  పిల్లి గండు

ఏమి పిల్లి –  నల్ల పిల్లి

ఏమి నల్ల –  కారునల్ల

ఏమి కారు –  పట్టుకారు

ఏమి పట్టు –  నారపట్టు

ఏమి నార –  గోగునార

           “మన పిల్లల పాటలు” నుంచి

ఏప్రియల్ 27, 2008. తొక్కు పలుకులు. మీ ఉద్దేశ్యం….

చందమామ రావె జాబిల్లి రావె

చందమామ రావె జాబిల్లి రావె

కొండెక్కి రావె కోటి పూలు తేవె

బండెక్కి రావె బంతిపూలు తేవె

తేరుమీద రావె తేనెపట్టు తేవె

పల్లకిలో రావె పాలు పెరుగు తేవె

పరుగెత్తి రావె పనసపండు తేవె

నా మాట వినవె నట్టింట బెట్టవె

అన్నీని తేవె అబ్బాయి కియ్యవె

          “మన పిల్లల పాటలు” నుంచి

ఏప్రియల్ 24, 2008. మన పిల్లల పాటలు. మీ ఉద్దేశ్యం….

కితకిత కితకిత

కితకిత కితకిత

ఇల్లలికి – ముగ్గేసి
ఆకేసి – పీటేసి
పప్పెట్టి – బువ్వెట్టి
పాలోసి – పెరుగోసి
అత్తారింటికి – తోవేదంటే
కిత కిత కిత కిత – కిల కిల కిల కిల

ఏప్రియల్ 17, 2008. మన పిల్లల పాటలు. మీ ఉద్దేశ్యం….

ఉగాది పండుగ వచ్చింది

ఉగాది పండుగ వచ్చింది
ఊరికి అందం తెచ్చింది
ఉత్సవాలతో దేవుళ్ళకు
ఊరేగింపులు సాగాయి
గుడిలో దేవుని పూజించి
గురువుల పెద్దలను రావించె
పంచాంగాలను చదివించె
మంచీ చెడ్డలు విన్నాము
అక్కలు బావలు ఆసలతో
చక్కావచ్చారు పండుక్కి
అమ్మ వేకువ లేచింది
అందరికి తలలు కడిగింది
సరిపడే నగలు ఇచ్చింది
సరిక్రొత్త బట్టలు పెట్టింది
కులదేవతలను కొలిచింది
గొప్పగా పూజలు చేసింది
ఊటలు నోట్లో ఊరంగా
ఉగాది పచ్చడి పెట్టింది
ఉగాది పండుగ వచ్చింది
ఊరికి అందం తెచ్చింది

ఏప్రియల్ 6, 2008. మన పిల్లల పాటలు. మీ ఉద్దేశ్యం….